బేగంపేట మే 11(జే ఎస్ డి ఎం న్యూస్)
దేవి పోచమ్మ అమ్మవారి కృప ప్రజలపై ఉండాలని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.రాంగోపాల్ పేట్ డివిజన్ పరిధిలో సోమ సుందరం స్ట్రీట్, శ్రీదేవి పోచమ్మ అమ్మవారి 74వ ఘటాభిషేక మహోత్సవానికి, గౌరవనీయులైన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, రాంగోపాల్‌పేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ ,ఆలయ కమిటీ సభ్యులు,డివిజన్ నాయకులు మరియు స్థానిక బస్తీ వాసులతో కలిసి శ్రీదేవి పోచమ్మ అమ్మవారిని దర్శించుకుని ఘటాభిషేక మహోత్సవం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు,ఈ కార్యక్రమంలో,బచ్చు శ్రీనివాస్,కోటగిరి రఘు రామ్ చందర్,కోవూరివెంకటేష్,శ్రీనివాసరావు,శివనారాయణ,డివిజన్ నాయకులు కిషోర్,ఆంజనేయులు,గౌరీ శంకర్, అరుణ్ బట్,నరేష్,చందు,సతీష్,ప్రవీణ్,మధు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ జీరా గార్డెన్ బస్తీలో జయంతి వేడుకల్లో ఉత్సవాలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈకార్యక్రమంలో నర్సింగరావు, విట్టల్, దశరథ్, సత్యనారాయణ, శ్రవణ్, మహేందర్, వినయ్,మాధవి, వైష్ణవి తదితరులు పాల్గొన్నారు .



