ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు ప్రభుత్వ ఆదేశాలను తూచ తప్పకుండా పాటించాలని మండల విద్యాశాఖాధికారి గురిజాల సుబ్బయ్య అన్నారు. ఎంఆర్ సి భవనంలో బుధవారం ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల కరస్పాండెంట్స్ , ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఎంఈఓ – 1 జి సుబ్బయ్య, ఎంఈఓ -2 సుధాకర్ రావులు పాల్గొన్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో సీ ఎస్సీ వెబ్ సైట్ లో ఫామ్-1 ను నిర్ణీత సమయంలో పూర్తి చేసి సమాచారాన్ని అందించాలని చెప్పారు. మండలంలో 15 ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రాధమిక, హైస్కూల్స్ ఉన్నాయని ఇప్పటికి కేవలం మూడు మాత్రమే పూర్తి చేసినట్లు ఆన్లైన్లో చూపిస్తున్నట్లు చెప్పారు. ఎంఈఓ -2 సుధాకర్ రావు మాట్లాడుతూ ఎస్ఎ -2 మార్కులను నమోదు చెయ్యాలని కోరారు. ప్రభుత్వ నిబంధనల తూచ తప్పకుండా పాటిస్తూ పాఠశాలలు నడిపించాలని కోరారు. సీఆర్.పి శ్రీనివాస్, ఎంఐ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

