రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వైద్యాధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా వైద్యులకు సూచించారు.
గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్ గోపాల క్రిష్ణ తో కలసి నాగులుప్పలపాడు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు. పేషెంట్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ ట్రాకింగ్ విధానాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించి వివరాలను అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఎన్టిఆర్ వైద్య సేవల కౌంటర్ ను, రోగుల రిజిస్ట్రేషన్ రూమును సందర్శించి రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ను, క్యాజువాలిటి రూములను, అత్యవసర సేవా విభాగంను, ల్యాబ్ తదితర విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, సౌకర్యాలపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, వైద్యులకు సూచించారు.
కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. వెంకటేశ్వర రావు, ఆసుపత్రి వైద్యులు డా. ఒనారియల్ తదితరులు ఉన్నారు.
