చర్చిల వద్ద ట్రాఫిక్ చాలాన్ల సమస్య నివారించాలి.సీఎం ప్రజావాణిలో బిషప్స్, పాస్టర్స్ వినతి.డీజీపీకి లేఖ రాసిన చిన్నారెడ్డి

హైదరాబాద్ మే 16( జే ఎస్ డి ఎం న్యూస్ ప్రధాన ప్రతినిధి) :
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలోనిచర్చిల వద్ద ప్రతి ఆదివారం క్రిస్టియన్స్ ప్రార్థనలు చేసే సమయంలో వాహనాలు రోడ్డు ప్రక్కన పెడుతుంటే ట్రాఫిక్ పోలీస్ లు చాలాన్లు వేస్తున్నారని, ఈ సమస్యను నివారించాలని కోరుతూ బిషప్స్, పాస్టర్స్, క్రిస్టియన్ సంఘం ప్రతినిధులు సీఎం ప్రజావాణి ఇంచార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జీ. చిన్నారెడ్డికి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.
ఈ సమస్యపై వెంటనే స్పందించిన చిన్నారెడ్డి
డీజీపీకి లేఖ రాశారు. చర్చిల వద్ద చాలాన్ల సమస్య రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని చిన్నారెడ్డిఆలేఖలోపేర్కొన్నారుక్రిస్టియన్స్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోనే సాల్మన్ రాజ్ నేతృత్వంలో ప్రతినిధులు సీఎం ప్రజావాణికి వచ్చారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *