బేగంపేట మే 16 (జే ఎస్ డి ఎం న్యూస్) :
సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, ఏఐసీసీ సభ్యురాలు కోట నీలిమ జన్మదినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. బేగంపేట ఓల్డ్ కస్టమ్ బస్తీలో సనత్ నగర్ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో పాల్గొన్న 25 మంది యువకులు రక్తదానం చేశారు. అనంతరం జీరాలో హోమ్ ఫర్ ది డిసేబుల్ 300 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విశాల్ సుదాం, నసీరుద్దీన్ (అడ్డు), హనీఫ్ ఖాన్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు .

