వికే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం నుండి ద్వితీయ ఇంటర్మీడియట్ సంవత్సరం వారికి తరగతులు నిర్వహించబడునని కళాశాల ప్రిన్సిపాల్ కొండపల్లి ఆంజనేయులు తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం కూడ సోమవారం నుండి అమలు అవుతుందని చెప్పారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు అడ్మిషన్స్ జరుగుతున్నట్లు తెలిపారు. ఎంపీసీ, సీఈసీ, ఓకేషనల్ కోర్సులు ఉన్నట్లు చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించి కళాశాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు.
నేటి నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తరగతులు
02
Jun