తాళ్లూరు వేణుగోపాల్ స్వామి దేవస్థాన భూములు కౌలు కు సాగు చేసుకొనుటకు సోమవారం దేవస్థానం ఆవరణలో వేలం పాటను దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. జె పంగులూరు గ్రూపు దేవస్థాన ఈఓ యూ శ్రీనివాస రావు (వాసు బాబు) సమక్షంలో వేలం పాటను నిర్వహించారు. సర్వే నంబర్ 641-2లో 12 ఏకరాల సాగుకు కౌలు పాటను నిర్వహించగా 35 మంది రైతులు పాల్గొన్నారు. అందులో కొత్త పాలెం గ్రామానికి చెందిన కైపు రామ కోటి రెడ్డి రూ.1.75 లక్షలకు పాటలో అధిక మొత్తంలో స్వంతం చేసుకున్నారు. మూడేళ్ల గాను వేలం పాట నిర్వహించినట్లు అందులో ప్రతి సంవత్సరం రూ. 1.75 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని ఈఓ వాను బాబు తెలిపారు. గతంలో రూ.60వేలు మాత్రమే ఉన్న కౌలు ఒక్క సారిగా రూ.1.75 లక్షలు పలకటతో దేవదాయశాఖ, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
