వ్యవసాయ రంగంలో రైతులు ఎప్పటి కప్పుడు నూతన సాగు పద్దతులను పాటిస్తూ
వ్యవసాయాన్ని లాభ సాటిగా మార్చు కోవాలిని శాస్త్రవేత్తలు నూచించారు. నాగంబొట్ల పాలెంలో వికసిత్ కృషి అభియాన్ కార్యక్రమం గురించి, ఖరీఫ్ ముందస్తు సాగు చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. నూనె గింజలు సాగు చేయటంలో విత్తనాల మీద పాలిమర్ కోటింగ్ వేసుకుని నాటు కోవటం వలన
ప్రయోజనం ఉంటుందని భూరతీయ నూనె గింజల పరిశోధన సంస్థ శాస్త్ర వెత్త డాక్టర్ లక్ష్మి ప్రయోగ తెలిపారు. నూనె గింజల రకాలు, సాగు చేసుకుని విధానం, అంతర పంటగా కూడ సాగు చేసుకునే అవకాశాలు, సూక్ష్మ ధాతు లోపాలను కూడ నివారించుకోవచ్చని వివరించారు. దర్శి కేవికే శాస్త్ర వెత్త టి వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ. జామ తోటలలొ పండు ఈగ నివారణకు రైతులు మిథనాల్ బుట్టలను ఎకరాకు పది పెట్టుకోవాలని సామూహిక చర్యల వలన మంచి ఫలితాలు ఉంటాయని చెప్పారు. చిరుధాన్యాల సాగుకు అనువైన సమయం అని చిరుధాన్యాల రకాలు గురించి వివరించారు. జిల్లా వనరుల కేంద్రవ ఎవో శైలజా రాణి మాట్లాడుతూ వేప ఉత్పత్తులను దుక్కిలో వేసి దున్నినట్లయితే సత్ఫలితాలు ఉంటాయని చెప్పారు. వ్యవసాయాధికారి ప్రసాద రావు మాట్లాడుతూ నబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, అన్నదాత సుఖీభవ, రైతు రిజిస్ట్రేషన్, ఖరీఫ్ నన్నద్ధత గురించి వివరించారు. పకృతి సాగు ఇన్చార్జి పి నరసింహులు మాట్లాడుతూ 26 రకాల విత్తనాల కిట్స్ రాయితీపై తీసుకోవాలని చెప్పారు. హెచ్ ఈఓ సర్ణలత, విఏఏ దయా సాగర్, బీటీఎం నాగ భూషణం, ఐసీఆర్పీలు వాణి, కోట రత్నం, అనంత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

