ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కరించేందుకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్
ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక”(మీ కోసం) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో వారి సమస్యలను ధైర్యంగా పోలీస్ అధికారులకు విన్నవించుకున్నారు. అధికారులు ఫిర్యాదుదారుల అర్జీలను స్వీకరించి, వారితో ముఖాముఖీ మాట్లాడి వారి సమస్యల పూర్వాపరాలను అడిగి తెలుసుకుని, వాటిని చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ కలహాలు, భర్త/అత్తారింటి వేధింపులు, జాబ్ మోసాలు, భూ వివాదాలు మరియు ఇతర సమస్యల గురించి వినయించుకున్నారు. ఈ కార్యక్రమంలో వచ్చిన ఆయా ఫిర్యాదులపై అధికారులు సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి వెంటనే చట్ట ప్రకారం విచారణ జరిపి పిర్యాదుదారులకు త్వరితగతిన న్యాయం అందించేలా చూడాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మహిళ డిఎస్పీ రమణ కుమార్, సిసియస్ ఇన్స్పెక్టర్ జగదీష్, ఎస్సీ ఎస్టీ సెల్ ఇన్స్పెక్టర్ దుర్గ ప్రసాద్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్ రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.


