జిల్లా పోలీస్ శాఖలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా ఫైనల్ మ్యాచ్ లో జిల్లా హెడ్ క్వార్టర్స్ టీమ్ విజయం సాధించింది. నిరంతరం విధుల్లో ఉండే పోలీసు అధికారులు, సిబ్బందికి ఒత్తిడి నుండి ఉపశమనంతో పాటు దేహధారుడ్యానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ జరిగిన ఫైనల్ మ్యాచ్ లో జిల్లా సబ్ డివిజన్ జట్టు మరియు జిల్లా హెడ్ క్వార్టర్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ కు జిల్లా ఎస్పీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీఏ.ఆర్ దామోదర్ మాట్లాడుతూ… క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. క్రీడాస్ఫూర్తితో ఆడాలని గెలుపోటములు ముఖ్యం కాదన్నారు. నిత్యం శాంతిభద్రతల పరిరక్షణ, వివిధ రకాల కేసులు దర్యాప్తు, బందోబస్తు మొదలైన విధులతో సతమతమవుతున్న సిబ్బందిలో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు ఈ క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించడం జరిగిందన్నారు. క్రికెట్ మ్యాచ్ ల్లో పోలీస్ సిబ్బంది చూపిన ఉత్సాహం, పోరాట స్ఫూర్తిని అభినందించారు. విధుల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారంలోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. అంతే కాకుండా క్రీడల ద్వారా లీడర్ షిప్, టీమ్ వర్క్ లాంటి లక్షణాలు పెంపొందుతాయని అన్నారు. హోదాలు మరచి అందరూ సమానమనే భావన మరియు స్నేహ స్వభావం, సమిష్టితత్వంలు పెంపొందడానికి క్రీడలు దోహదం చేస్తాయి. కావున ప్రతి ఒక్కరు ఏదో ఒక్క క్రీడను ఎంచుకొని ఆడటం వలన మానసిక ఒత్తిడిని అధికమించి, ఆరోగ్యంగా ఉంటారని తెలియచేసినారు.
తదుపరి జిల్లా సబ్ డివిజన్ పోలీస్ అధికారుల జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్లను కోల్పోయి 94 పరుగులు చేసింది. అనంతరం 95 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జిల్లా హెడ్ క్వార్టర్ జట్టు 9 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
జిల్లా సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది జట్టు నిర్ణీత 9.5 ఓవర్లలో అల్ అవుట్ అయి 53 పరుగులు చేసింది. అనంతరం 54 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జిల్లా హెడ్ క్వార్టర్ జట్టు 6.5 ఓవర్లలోనే కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ టోర్నమెంట్ లో ఎఆర్ ఎస్పీ అశోక్ బాబు( ఎన్సీ), అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, డిఎస్పీలు శ్రీనివాసరావు, లక్ష్మి నారాయణ, సాయి ఈశ్వర్ యశ్వంత్, నాగరాజు, శ్రీనివాసరావు, సీఐలు, ఆర్ఐలు, ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.



