సంవత్సర కాలంలో అన్ని వర్గాలకు వెన్ను పోటు పోడిచిన ఘనత చంద్రబాబు నాయుడు కే దక్కిందని వైసీపి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి అన్నారు. దర్శిలో బుధవారం వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం ఉత్సాహంగా నిర్వహించారు. వైసీపీ పార్టీ కార్యాలయం నుండి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైసీపీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. గడచిన అసెంబ్లీ ఎన్నికలలో అలవికాని 143 హామీలతో పాటు సూపర్ సిక్స్ అంటూ చంద్రబాబు ప్రజలను మభ్య పెట్టి అధికారంలోనికి వచ్చారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయక వెన్పుటు పోడిచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. చదువుకునే పిల్లలకు అమ్మ ఓడి ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పారని, విద్యా సంవత్సరం గడిచినా అమలు కాలేదని అన్నారు. రైతులు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అయినా సరే వారికి ఇస్తామన్న రైతు భరోసా అడ్రస్ లేదని అన్నారు. మహిళలకు ఏడాదికి ఇస్తామన్న 18వేలు, ఆర్టీస్ ఉచిత ప్రయాణం ఎమైనట్లు అని ప్రశ్నించారు. విద్యుత్ చార్జీలు సర్ చార్జీల పేరుతో బాదిన విషయాలను గుర్తు చేసారు. ఏడాదిలోనే చంద్రబాబుపై పూర్తి వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. ఇచ్చిన ప్రతి హామీని నేరవేర్చిన ఘనత వైఎస్సార్సీపీదే అని అని అది ఒక్క జగనన్నదే దక్కుతుందన్నారు. ముందుగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు.
పోలీసులు కఠిన ఆంక్షలు ….
వైసీపీ పిలుపు ఇచ్చిన వెన్నుపోటు దినోత్సవంకు అధిక సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. అయితే పోలీసులు ముందుగా విధించిన ఆంక్షలలో బాగంగా తహసీల్దార్ కార్యాలయంలోనికి కార్యకర్తలను పూర్తి స్థాయిలో అనుమతి ఇవ్వలేదు. కొంత మంది మాత్రమే వెళ్లాలని అవి కూడ ప్లే కార్డులు, జెండాలు తీసి వేసి వెళ్లాని సూచించారు. దీంతో తప్పనిసరి పరిస్థితిలలో వైసీపి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డితో పాటు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైసీపీ దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు, దొనకొండ, మండల అధ్యక్షులు వెన్నపూస వెంకట రెడ్డి, చింతా శ్రీనివాస రెడ్డి, టీవీ సుబ్బా రెడ్డి, కాకర్ల క్రిష్ణా రెడ్డి, సుబ్బయ్య యాదవ్, ముండ్లమూరు ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మా రెడ్డి, వైఎస్ ఎంపీపీ సోము దుర్గా రెడ్డి, జయంతి, మాజీ ఎంపీపీ దేవదానం, మాజీ ఎఎంసీ చైర్మన్ కెవీ రెడ్డి, బండి గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






