హైదరాబాద్ జులై 7(జే ఎస్ డి ఎం న్యూస్) :
వికలాంగులకు వెన్ను దన్నుగా నిల్చి వారికి కృత్రిమ అవయవాలను అందించి పలువురికి ఆదర్శంగా నిలిచింది భారత్ వికాస్ పరిషత్.రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు వికలాంగులను హైదరాబాద్ కు తీసుకుని వచ్చి వారికి కృత్రిమ అవయవాలను అందించి తమ ఔదార్యం చాటుకున్నారు.రఘు సతీష్ కుమార్,రాజశేఖర్ లు.ఎన్నో ఏళ్లుగా నడిచేందుకు ఒక కాలు లేక ఎంతో ఇబ్బంది పడిన వికలాంగులకు రఘు సతీష్ కుమార్,రాజశేఖర్ లు కృత్రిమ అవయవాలను అందించి వారికి అండగా నిలిచారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు కు చెందిన రాజమ్మ, అనంతపురం నుండి వెంకటమ్మ, నల్లగొండ జిల్లా చిట్యాల గ్రామం నుండి యాదగిరి, రాంబాబులకు కృత్తిమ అవయవాలు భారత్ వికాస్ పరిషత్ ట్రస్ట్ ద్వారా రఘు సతీష్ కుమార్ భారత్ వికాస్ పరిషత్ స్టేట్ సంపర్క్ వైస్ ప్రెసిడెంట్ మరియు జిజియాబాద్ బ్రాంచ్ చీఫ్ ప్యాట్రన్ రాజశేఖర్ లు అందించారు.వారికి కృత్తిమ అవయవాలు అమర్చి తిరిగి స్వస్థతలకు పంపించారు. వారు ఈ విధంగా కృత్రిమ అవయవాలు అమర్చడం చాలా ఉపయోగకరంగా ఉందని.భారత్ వికాస్ పరిషత్ ట్రస్టును మరియు రఘు సతీష్ కుమార్ ,రాజశేఖర్ లకు వారు కృతఙ్ఞతలు తెలియ జేశారు. తమకు కృత్రిమ అవయవాలపై అవగాహన కల్పించి హైదరాబాదులో ఉన్న భారత వికాస్ పరిషత్ ట్రస్ట్ కు తీసుకొని అవయవాలు అందజేయడం తమకు ఎంతో సంతోషంగా ఉందని. అవయం లేదని ఇన్ని రోజులు ఎంతో బాధ పడుతూ బతికామని తమ అవసరాన్ని గుర్తించి తీర్చినందుకు వారికి జీవితాంతం రుణపడి ఉంటామని వారు తెలియజేశారు.తమ ట్రస్ట్ ద్వారా నిరంతరం పేదలకు సేవలు అందించేందుకు ముందుంటా మని సతీష్ కుమార్ , రాజశేఖర్ లు తెలియ జేశారు.
