బొద్దికూరపాడుకు పలు ఆర్టీసీ సర్వీసులు పునరిద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. పొదిలి డిపోకి చెందిన బస్సు బొద్దికూరపాడు మీదుగా ఒంగోలు క ఉదయం 11.15 నిముషాలకు వస్తుంది. అయితే ఆ బస్సు 40 రోజుల క్రిందట రద్దు చేసారు. తిరిగి ఆ సర్వీన్ను పునరుద్దరించలేదు. అదే విధంగా కోవిడ్ కి ముందు పొదిలి నుండి విజయవాడ వెళ్లు బస్సు సర్వీన్ ఉన్నది. బస్సు రాజంపల్లి, కొత్త పల్లి, బొద్దికూరపాడు, వెలుగు వారి పాలెం, నాగంబొట్ల పాలెం, తూర్పుగంగవరం, తాళ్లూరు, అద్దంకి, రేణంగి వరం మీదుగా విజయవాడ వెళ్లు నర్వీన్ మంచి ఆక్యూపెన్స్ తో నడిచేది. తర్వాత కాలంలో ఆ సర్వీన్ను కూడ రద్దు చేసారు. ఆ రెండు నర్వీన్ల రద్దుతో బొద్దికూరపాడు నమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామ సర్పంచి మందా శ్యామ్సన్, ఎంపీటీసీ బాల కోటయ్య, ఉప సర్పంచి పులి ప్రసాద్ రెడ్డి, రిటైర్డ్ హెచ్ఎం సన్నపు రెడ్డి అంజి రెడ్డి, పలువురు గ్రామ పెద్దలు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ నన్నపు రెడ్డి నురేష్ రెడ్డిని కలిసి రెండు సర్వీన్లు ఏర్పాటు చేయించాలని కోరారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకుని ప్రజలు ఇబ్బందులను తీర్చాలని కోరుతున్నారు.
