వైసీపి తాళ్లూరు మండల పార్టీ కార్యదర్శిగా భీమని సుబ్బా రావును నియమించిన సందర్భంగా ఆపార్టీ తూర్పుగంగవరం నాయకులు వైసీపి జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. చీమకుర్తిలో డాక్టర్ బూచేపల్లి నివాసానికి వెళ్లి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లిని, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మను కలిసి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. పూల మాలలతో సత్కరించారు. కార్యక్రమంలో గుంటి గంగా భవాని ఆలయ ట్రస్ట్ మాజీ చైర్మన్ కటకంశెట్టి శ్రీనివాస రావు, సీనియర్ నేత గూడ గోపాల్ రెడ్డి, మాజీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పూనూరి దేవదానం, అడ్వకేట్ నాగమల్లేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
