దివంగత సినిహీరో, దివంగత ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బా రెడ్డి తనయుడు బూచేపల్లి కమలాకర్ రెడ్డికి మండల వైసీపి శ్రేణులు ఘన నివాళులు అర్పించారు. తూర్పుగంగరం, చీమకుర్తి రోడ్ లోని ఆయన ఘాట్ వద్ద పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. సినీ, రాజకీయ రంగానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. వైసీపి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లిని కలసి ఆయనతోపాటు నివాళులు అర్పించారు. మండల పార్టీ అధ్యక్షుడు టీవీ నుబ్బా రెడ్డి, తాళ్లూరు మండల నర్పంచిల సంఘం అధ్యక్షుడు మారం ఇంధ్ర సేనా రెడ్డి, నర్పంచిలు వలి, కెఎన్ వెంకట రామి రెడ్డి, సుబ్బా రావు, మాజీ సర్పంచిలు క్రిష్ణా రెడ్డి, సుబ్బారెడ్డి పలు విభాగాల బాధ్యులు, నాయకులు తదితరులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.

