కస్తూరిభా పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన మేర మరుగుదొడ్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలో మొత్తం 230 మంది విద్యార్థులు ఉండగా వారు నత్యకృత్యాలు తీర్చుకునేందుకు పైన, కింద కలిపి 30వరకు మరుగు దొడ్లు ఉన్నాయి. అయితే కొన్ని పూడి పోయి అపరిశుభ్రంగా ఉన్నాయి. ఎనిమిది మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో స్నానాలు చేయటానికి, వాష్ రూమ్ లు గా ఉపయోగించుకునేందుకు విద్యార్థునులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిధులు కొరత వలన మెయింటెన్స్ సక్రమంగా లేక పోవటం విద్యార్థులకు శాపంగా మారింది. సంబంధిత అధికారులు స్పందించి విద్యార్థునులు మురుగు బాధలు తీర్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
కస్తూరిభా గాంధీ పాఠశాలలో అవసరమైన మేర మరుగుదొడ్లు లేక ఇబ్బందులు
13
Jul