దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ నాయకురాలు దారం నాగవేణి సుబ్బారావు ను నియమిస్తూ మార్కెటింగ్ శాఖ నుండి సోమవారం ప్రత్యేక జీవోను విడుదల చేశారు. అదే విధంగా వైస్ చైర్మన్ గా మస్తాన్ ను నియమించారు.
దీంతో నియోజకవర్గంలో తెలుగుదేశం శ్రేణుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది. టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చెప్పిన విధంగానే జీవో విడుదల కావడంతో టీడీపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తం అవుతుంది.

