కూటమి ప్రభుత్వం రాకతో మండలంలోని
వెలుగు క్రాంతి పథకం లో మండలంలో దీర్ఘకాలంగా పని చేయుచున్న వివోఏ (విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్)లను తొలగించి కొత్తవారిని నియమించారు. తాళ్లూరు మండలంలో 39 మంది వివోఏలు ఉండగా ఎక్కువ మంది స్వచ్చందంగా మానుకోగా, కొందరిని నింబంధన మేరకు తొలగించారు. తూర్పుగంగవరం గ్రామ సంఘంకు చెందిన వివోఏ ప్రమీలారాణి దీర్ఘకాలంగా పని చేస్తున్నందున తొలగించి కొత్తవారిని నియమించాలని దర్శి టీడీపీ ఇంచార్జి వర్గీయులైన గ్రామపార్టీ అద్యక్షులు కనిశెట్టి రామలక్ష్మయ్య అనుచరులు, ప్రమీలారాణీని యధావిధంగా కొనసాగించాలని ఎంపీ మాగుంట వర్గీయులు గ్రామ ఉపసర్పంచ్ వై.కాశిరెడ్డి అనురచులు స్థానిక వెలుగు అధికారులపై తీవ్ర వత్తిళ్లు తెస్తున్నారు. అధికార టీడీపీ నాయకులు ఇరువర్గాలుగా వత్తిళ్లు తెస్తుడటంతో ఏపీఎం దేవరాజ్ తీవ్ర క్షోభకు గురవుతున్నారు.
గత 10 నెలలుగా ఇరువురు తమ తమ అధినాయలకు వద్దకు వెళ్లి కొనసాగించాలని ఒకరు, తొలగించాలని మరొకరు ఏపీఎంకు హకుం జారీ చేస్తూ వున్నారు. ఇటీవల రెండో పర్యాయం గ్రామటీడీపీ అధ్యక్షులుగా ఎంపికైన రామలక్ష్మయ్య, అనుచరులు దర్శి ఇంచార్జిని కలిసి గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి విజయానికి వివోఏ ప్రమీలారాణి ఇంటింటి ప్రచారం చేశారని సంబందిత ప్రచారంలోవున్న ఫోటో పాటు ఆదారాలను అందజేశారు. ఆ వివోఏ 5ఏళ్లుగా పైగాకొనసాగుతున్నదని, నిబందనల మేరకు తొలగించి కొత్తవారిని నియమించాలని గట్టి పట్టు బట్టారు. దీంతోమూడు సమావేశాలు నిర్వహించనందున నింబంధనల మేరకు వివోఏను తొలించనున్నట్లు తెలినట్లు తెలిసింది. సమస్య జఠిలం కావటంతో ప్రమీలను వివోఏ గ్రూపు నుండి ఏపిఎం తొలగించినట్లు తెలిసింది. ఏపిఎం తనపై కక్షగట్టి తీసి వేసేందుకు గ్రూపునుండి తొలగించాడని పేర్కోంటూ ప్రమీల ఆదివారం ఇంటిలో చీరెతో ఉరి వేసుకోబోగా ఇంటింటోని వారు ప్రమాదం నుండి తప్పించారు. ఒంగోలు రిమ్స్ తరలించి చికిత్సలు చేయించగా కోలుకున్నట్లు సమాచారం. అధికార ప్రభుత్వంలో నేతల మధ్య ఉన్న ఆదిపత్యపోరువల్ల గ్రామాల్లో ఇలాంటివి జరుగుతున్నాయని ప్రజలు పెదవి విరుస్తున్నారు.
