ఇతర రాష్ట్రాల వలస కార్మికులతో పాడి పరిశ్రమలో పనులు చేస్తున్న యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఐ మల్లికార్జునరావు కోరారు. స్థానిక పోలీస్ స్టేషన్లో సోమవారం పాడి పరిశ్రమ యజమానులతో సమావేశం నిర్వహించారు.
ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన పనివారు అనగా బీహార్ , ఒడిస్సా తదితర రాష్ట్రాల నుండి వచ్చి పాడి పరిశ్రమ షెడ్లలో పనిచేస్తున్న వారు మత్తుపదార్థాలు , గంజాయి నిషేధం గురించి తెలియజేసి మంచి ప్రవర్తనతో ఉండేలా చూసుకోవాలని చెప్పారు. అదేవిధంగా నెంబర్ ప్లేట్స్ లేని మోటార్ సైకిల్ , డాక్యుమెంట్స్ లేని వాహనాలు ఉపయోగించకుండా చూడాలని కోరారు . కల్తీ పాల తయారీదారులపై ప్రత్యేక నిఘా ఉందని ఎవరైనా అటువంటి కల్తీ చేస్తుంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. వలస కార్మికుల విషయంలో యజమానులు వారికి ఇక్కడ చట్టాలపై అవగాహన కల్పించి మంచి ప్రవర్తన ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత యజమానులదే అని స్పష్టం చేశారు.

