సికింద్రాబాద్, జూలై 19 :
హైదరాబాద్ లయన్స్ క్లబ్ ఆఫ్ నవభారత్, వనిత భారత్ క్లబ్ ల ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ పదవీస్వీకరణ ఇన్స్టలేషన్ ప్రొగ్రాం శనివారం లయన్స్ భవన్ సికింద్రాబాద్ లయన్స్ క్లబ్ భవనంలో జరిగింది. ముఖ్య అతిథిగా లయన్ సురేష్ జగ్నాని హాజరై 2025-–26 లయనిస్టిక్ సంవత్సరానికి నవభారత్ ప్రెసిడెంట్ గా లయన్ పి. స్వరూపారాణి, కార్యదర్శిగా రమణయ్య, కోశాధికారిగా రాజీవ శర్మ తో పాటు వనిత భారత్ క్లబ్ ప్రెసిడెంట్ గా లయన్ జి. కృష్ణవేణి, వైస్ ప్రెసిడెంట్ గా లయన్ పి. జ్యోతి రాజా, కార్యదర్శిగా లయన్ జి .లక్ష్మీ , కోశాధికారిగా లయన్ జయశ్రీ ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. లయన్ కె. యాదయ్య గౌడ్ ఈ రెండు క్లబ్ లల్లో నూతనంగా చేరిన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి, ఇండక్షన్ ఆఫీసర్ గా లయనిజం గురించి, సర్వీస్ ప్రాముఖ్యత గురించి వివరంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ లయన్స్ మోహన్ దాసు, ఎన్. రాంప్రసాద్ రావు , తదితరులు పాల్గొన్నారు, సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులు ప్రసన్న, శైలజలకు రూ.5000 వనిత భారత్ తరపున అందజేశారు, మరొక బాలిక వర్ణికాకు చదువు కోసం రూ.32000 లను పిడుగు హరి ప్రసాద్ ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ ఆంధ్ర ప్రదేశ్ తరపున పి స్వరూపారాణి అందజేశారు.
