మున్సిపల్ శాఖలో ఔట్సోర్సింగ్
నాన్-ప్రొఫెషనల్ వర్కర్ల వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేటగిరీ-1 వర్కర్ల వేతనం 21,500 నుంచి 24,500, కేటగిరీ -2 వర్కర్ల వేతనం రూ.18,500 నుంచి రూ.21,500కు, కేటగిరీ-3 వర్కర్లకు రూ.15,000 నుంచి రూ.18,500కు పెంచింది. కాగా తమకు వేతనాలు పెంచాలని వీరు గత కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు.
