దొనకొండ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం మిస్సైల్ ల తయారీ యూనిట్ ను ప్రారంభించేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది. ఆదివారం రోజు సంబంధిత అధికారులు, రెవెన్యూ అధికారులతో కలిసి దొనకొండ ప్రాంతంలోని ప్రభుత్వ భూములను పరిశీలించారు. దొనకొండ ఎయిర్పోర్ట్ ప్రాంతాన్ని కూడా పరిశీలించినట్లు సమాచారం. బ్రహ్మోస్ వంటి శక్తివంతమైన క్షిపణులు దొనకొండ ప్రాంతంలో తయారుచేసే అవకాశాలు ఉన్నట్లు ప్రస్తుత సమాచారం.
