ఒంగోలు నగరంలోని దేసు ఇంటిపేరు గల కుటుంబాలన్నీ కలసి “దేసు ఫ్యామిలీస్ వెల్ఫేర్ అసోసియేషన్” పేరుతో సంఘము గా ఏర్పడి ప్రతి సంవత్సరము వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి మావంతుగా సంపాదించిన ధనములో కొంత తిరిగి ఇవ్వడం జరుగుతూ ఉన్నదని దేసు ఫ్యామిలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దేసు కృష్ణారావు తెలిపారు.
ఆషాఢ మాసం చివరి వారమును పురస్కరించుకొని స్థానిక భాగ్యనగర్ 4వ లైన్ లోని బొమ్మరిల్లు అనాధ పిల్లల గృహములో మధ్యాహ్న భోజనాన్ని పిల్లలకు అందించారు. ఈ సందర్భంగా దేసు కృష్ణారావు మాట్లాడుతూ మా దేసు ఫ్యామిలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు అభాగ్యలకు వస్త్రాలు వితరణ, విద్యార్థులకు విద్యాసామగ్రి పుస్తకాల వితరణ, తదితర సేవా కార్యక్రమాలు చేయుచున్నామని, దేసు కుటుంబ సభ్యులందరం ఒకే మాట మీద నిలబడి అందరి సహకారం తో ముందుకు సాగుతున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేసు ఫ్యామిలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు దేసు కృష్ణారావు, ఉపాధ్యక్షులు దేసు శ్రీనివాసరావు, కోశాధికారి దేసు సుబ్బయ్య మరియు దేసు వెంకటేశ్వర్లు, దేసు శ్రీనివాసరావు, దేసు వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.


