గ్రామాల్లో పారిశుధ్య పనులపై ప్రత్యేక శ్రద్ద వహించాలి -జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా

గ్రామాల్లో పారిశుధ్య పనులపై ప్రత్యేక శ్రద్ద వహించాలని, పారిశుధ్య నిర్వహణలో అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా స్పష్టం చేసారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ముండ్లమూరు మండలంలోని పూరిమెట్ల, కెల్లంపల్లి, పెద్ద ఉల్లగల్లు గ్రామాలను సందర్శించి పారిశుధ్య నిర్వహణ, పి4 విధానంలో నీడ్ బేస్డ్ ప్రాథమిక సర్వే తీరును పరిశీలించి వివరాలను అధికారుల నుండి అడిగి తెలుసుకున్నారు. తొలుత జిల్లా కలెక్టర్ పూరిమెట్ల గ్రామాన్ని సందర్శించి పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు. ప్రతిరోజు డిప్యుటీ ఎంపిడిఓ లు, పంచాయతీ కార్యదర్శులు క్షేత్ర స్థాయిలో పర్యటించి పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్, పంచాయతీ రాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. డోర్ టు డోర్ చెత్త సేకరణన నిర్వహణ సక్రంగా నిర్వహించాలని, సేకరించిన చెత్తను ప్రాసెస్ చేయాలని ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణలో అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేసారు. వర్షా కాలం సీజన్ ప్రారంభమైనందున పారిశుధ్య నిర్వహణపై దృష్టి సారించడంతో పాటు ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందజేయాల్సిన బాధ్యత పంచాయతీ రాజ్ శాఖ అధికారులపై ఉందన్నారు. త్రాగునీటి పైపులైన్లు ఎక్కడ లీకేజీ జరగకుండా చూడాలని, అలాగేప్రభుత్వం నిర్దేశించిన రోజులలో ఓవర్ హెడ్ ట్యాంకులను క్లోరినేషన్ తో పరిశుభ్రం చేయాలని, కుళాయిల ద్వారా నాణ్యమైన తాగునీరు ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని పంచాయతీ సెక్రెటరీ, ఏఈలను, వైద్య ఆరోగ్య సిబ్బందిని సమన్వయం చేసుకొని వ్యాధులు ప్రబలకుండా ఎంపీడీవోలు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రణాళిక బద్ధంగా ఓవర్ హెడ్ ట్యాంక్స్ ను శుభ్రం చేయాలని, పంపుసెట్లు, బోర్వెల్స్ దగ్గర బహిరంగ మలమూత్ర విసర్జన జరగకుండా చర్యలు చేపట్టాలని, త్రాగునీటి పైపులల్లోకి మురుగునీరు కలవకుండా అవసరమైన చోట్ల మరమ్మత్తులు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, గ్రామస్థులతో ముఖాముఖి మాట్లాడుతూ… గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ ఎలా వుంది, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, సేవలు పనితీరు ఎలా వుంది అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సేవలపై ప్రజాస్పందనల సంతృప్తి స్థాయిని పెంపొందించే విధంగా పని చేయాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. పి4 కార్యక్రమంలో భాగంగా గ్రామంలో జరిగిన నీడ్ బేస్డ్ ప్రాథమిక సర్వే తీరును పరిశీలించి అధికారుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో గుర్తించబడిన బంగారు కుటుంబాల సభ్యులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సమాజంలో ఆర్ధిక అసమానతలు తొలగించి పేదరికంలేని సమాజాన్ని రూపొందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పీ4 కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని వివరించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ కెల్లంపల్లి గ్రామాన్ని సందర్శించి గ్రామంలో జరుగుచున్న పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు. గ్రామంలో గుర్తించబడిన బంగారు కుటుంబాల సభ్యులతో జిల్లా కలెక్టర్ మాట్లాడి భరోసా కల్పించారు. ఈ గ్రామంలో పి4 కార్యక్రమం కింద 10 కుటుంబాలను దత్తతు తీసుకున్న నిడమానూరు శ్రీనివాస రావు ను జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందిస్తూ శాలువాతో సన్మానించారు. అనంతరం గ్రామంలోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించి వర్మీ కంపోష్ట్ తొట్టెలను, పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతి రోజు డోర్ టు డోర్ చెత్త సేకరణ కార్యక్రమం ఏ విధంగా జరుగుచున్నది, ఎంతమంది సిబ్బంది వున్నారు, సేకరించిన చెత్తను ఏ విధంగా తడి చెత్త, పొడి చెత్తగా వేరుచేస్తున్నారు, తదితర వివరాలను పంచాయతీ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా క్లాప్ మిత్రలతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. నెలకు ఎంత జీతం ఇస్తున్నారు, హెల్త్ కార్డ్స్, ఇన్సూరెన్స్ ఉందా లేదా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణ పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, పంచాయతీ అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పెద్ద ఉల్లగల్లు గ్రామాన్ని సందర్శించి గ్రామంలోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని, వర్మీ కంపోష్ట్ తొట్టెలను, పనితీరును పరిశీలించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

జిల్లా కలెక్టర్ వెంట ఒంగోలు ఆర్డిఓ లక్ష్మి ప్రసన్న, జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి, డిపిఓ వెంకట నాయుడు, తహసిల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపిడిఓ శ్రీదేవి, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *