విద్యార్థులు నమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలని తాళ్లూరు ఎన్ఐ మల్లికార్జునరావు అన్నారు. ఏబీసీ హైస్కూల్లో మంగళవారం విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసారు. నమాజంలో ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని లక్ష్య సాధనకు కృషి చెయ్యాలని చెప్పారు. మీ చుట్టూ ఉండే సమాజంలో వ్యక్తులు మీ పడ్డ ప్రవర్తిస్తున్న తీరును నిశితంగా పరిశీలించి గుడ్ టచ్ బ్యాడ్ టచ్పి అవగాహన కలిగి ఏమైనా పొరపాటుగా ప్రవర్తిస్తుంటే డోట్ టచ్ అని హెచ్చరించాలని తల్లిదండ్రులకు తెలిపాలని చెప్పారు. స్వీయ సంరక్షణ పద్దతులు, ఈవ్ టీజింగ్ ప్రేమ పేరుతో మోసాలు మహిళలు చట్టాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్ఎం ఎన్లు, ఓటీపీ మోసాలు, బ్యాంకు పేరుతో వచ్చే మోసాలు, వాట్సాప్, ఫేక్ లింక్లు, ఫేక్ లోన్ యాప్స్, కె వైసీ మోసాలు, డిజిటల్ అరెస్ట్ మోసాలు గురించి చెప్పారు. ఒకవేళ మీ బంధువులు సైబర్ క్రైమ్ బాధితులు అయితే తక్షణమే టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫిర్యాదు చేసి తగిన వివరాలు తెలిపాలని కోరారు. మాదక ద్రవ్యాల వినియోగం వలన విద్యకు కలిగే అనర్థం గురించి చెప్పారు. రోడ్డు భద్రత విషయంలో మీరు, కుటుంబసభ్యులు భద్రంగా ఉండేలా తగిన సూచనలు చెయ్యాలని, మైనర్లు వాహనాలు నడపటం నేరమని తెలిపారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులలో అయినా డయల్ 100/ 112కి కాల్ చేయటం ద్వారా పోలీసులు సహాయం పొందవచ్చని చెప్పారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ శ్రీనివాస రెడ్డి, ప్రిన్సిపాల్ కె వెంకటేశ్వర రావు, డైరెక్టర్ కాలేషా బాబులు పాల్గొన్నారు.
