“పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది” అనే చందంగా.., ఒకప్పుడు దరిశి తహశీల్దారు కార్యాలయంలో చిరుద్యోగిగా తన ఉద్యోగ ప్రస్తానాన్ని మొదలుపెట్టి “ఇంతింతై వటుడింతై” అనేవిధంగా.., దరిశి నియోజకవర్గ పరధిలోవున్న తాళ్ళూరు మండలంలోని రజానగరం అనే ఓ కుగ్రామ వాస్తవ్యుడు పులి శ్రీనివాసులు అంచెలంచెలుగా ఎదిగి, తన ఉద్యోగజీవితంలో ఉన్నతాధికారుల మన్ననలు పొందుతూ, భారత దేశంలోనే అత్యున్నతమైన సర్వీసు ఐఏయస్ ఎంపిక కాబడి, గత ప్రభుత్వంలో ఐఏయస్ హోదాలో చిత్తూరు జాయింట్ కలెక్టర్ గా పనిచేసి, ప్రస్తుతం గుంటూరు నగరపాలక సంస్థ కమీషనర్ గా చేస్తున్న పులి శ్రీనివాసులు., పారిశుధ్యంలో గుంటూరు నగరపాలక సంస్థ(జీ ఎం సీ)చేస్తున్న సేవలకు, భారత దేశ అత్యున్నతపురష్కారం”స్వచ్ఛ సర్వేక్షణ్” ఈ నెల 17 న దేశ రాజధాని డిల్లీలో భారత రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతులమీదుగా అందుకోవడం ఈనాటి యువతకు ,విద్యార్థులకు,సమాజానికి మంచి దిక్చూసి లాంటివాడని, అందరికీ ఆదర్శప్రాయుడని కపురం శ్రీనివాసరెడ్డి ఆయన సేవలను కొనియాడారు.
పులి.శ్రీనివాసులు. , రాష్ట్రపతి అవార్డ్ (“స్వచ్ఛ సర్వేక్షన్”)అవార్డ్ స్వీకరించిన శుభ సందర్భంగా, సోమవారం జిల్లా మానవత స్వచ్ఛంద సేవాసంస్థ డైరెక్టర్, జిల్లా ఐఆర్సీయస్ ఎగ్జికూటివ్ మెంబర్ కపురం శ్రీనివాసరెడ్డి, గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో కలిసి, పుష్ప గుచ్ఛం అందించి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాంటివారు ఉద్యోగులకు,విద్యార్థులకు,ముఖ్యంగా ఈ సమాజానికి మంచి ఆదర్శప్రాయులు,మార్గదర్శకులని, ఆయన అంకితభావాన్ని,క్రమశిక్షణను,వినయ విధేయతను, ముఖ్యంగా ఎదిగేకొద్దీ ఒదిగి వుండే వ్యక్తిత్వాన్ని సమాజంలోని పౌరులందరూ కలిగివుండాలని కపురం శ్రీనివాసరెడ్డి తెలిపారు.

