ఇటీవల బెంగళూరులో స్వల్ప శస్త్ర చికిత్స చేయించుకుని ఒంగోలుకు వచ్చిన ఏపీయూడ బ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ.సుబ్బారావును. ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ పరా మర్శించారు. స్థానిక మంగమూరురోడ్డులోని జర్నలిస్టుకాలనీలో మంగళవారం ఉదయం ఐవీని కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు అంశాలపై వారు చర్చించుకున్నారు.
పరామర్శించిన వారిలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఏ.సురేష్, జిల్లా కార్యదర్శి డి.కనకయ్య, బాపట్ల జిల్లా యూనియన్ అధ్యక్షులు సి హెచ్ రాంబాబు, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బి వెంకట రావు తదితరులు ఉన్నారు.
