కూటమి ప్రభుత్వంలో అన్ని శుభ గడియలే అని దర్శి నియోజక వర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్లు అన్నారు. బొద్దికూరపాడు గ్రామంలో బుధవారం సుపరిపాలన – తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. దర్శి టీడీపి నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ లు ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టి పాటి లక్ష్మి మాట్లాడుతూ …మన ప్రభుత్వంలో ప్రజలు ఆనందంగా ఉన్నారని. స్వేచ్చగా జీవిస్తున్నారని అన్నారు. వరుణుడి దయతో నీటి వనరులు డ్యాం నిండాయని, రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారని చెప్పారు. త్వరలోనే అన్నదాత సుఖీభవ నగదు కూడ వస్తుందని చెప్పారు. ఎరువులు, బ్లాక్ మార్కేట్లో అమ్మినా కఠిన చర్యలు తప్పవని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు లు ఏడాదిలో ఆంధ్ర రాష్ట్ర పునర్మిణానికి నిత్యశ్రామికులుగా శ్రమిస్తున్నారని అన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ స్కాంలకు పాల్పడిందని విమర్శించారు. జగన్ అండ్ కో లిక్కర్ స్కాంలో దొరికి పోయారని అన్నారు. త్వరలోనే జగన్ జైలు కు వెళ్తారని జోష్యం చెప్పారు. త్వరలో తాళ్లూరులో రూ. 20 కోట్లతో నిర్మించనున్న నబ్ స్టేషన్ ప్రారంభమవుతుందని తెలిపారు. మొగలిగుండాల రిజర్వాయర్ కూడ ప్రజలకు అంకితమవుతుందని చెప్పారు. గ్రామాలలో మౌళిక వసతులు అభివృద్దికి కృషి చేస్తానని చెప్పారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధిని వివరించారు. మహిళలు, కార్యకర్తలు డాక్టర్ గొట్టిపాటి దంపతులకు ఘనంగా స్వాగతం పలికారు. రైతులకు నబ్సిడీపై విత్తనాలు, కౌలు కార్డులు అందించారు. కోదండరామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎఎంసీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బా రావు, ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, మాజీ అధ్యక్షుడు ఓబులు రెడ్డి, బికే పాడు గ్రామ పార్టీ నాయకులు పోలం రెడ్డి రమణా రెడ్డి, సుబ్బా రెడ్డి, కోటి రెడ్డి, వీర నాగి రెడ్డి, అంజి రెడ్డి, గోపాల్ రెడ్డి, చందన, క్లస్టర్ ఇన్చార్జి క్లస్టర్ ఇన్చార్జి రాచకొండ వెంకట రావు, పిన్నిక రమేష్ బాబు, వలి తదితరులు పాల్గొన్నారు.



