తాళ్లూరు మండలం, బొద్దికూరపాడు గ్రామం లో బుధవారం సాయంత్రం రైతులకు కంది విత్తనాల మినీ కిట్లను మరియు కౌలు చేసుకునే రైతులకు 110 మందికి పంట సాగు హక్కు పత్రాలను
దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మాట్లాడుతూ…
అధునాతన వ్యవసాయ విధానం ద్వారా రైతులు లాభాలు పంట పండించాలని ఆమె కోరారు. రైతుల కోసం రైతుల అభ్యున్నతి కోసం మన కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు , వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని లక్ష్యంతో మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో మిర్చి పొగాకు మామిడి అపరాల రైతుల ఆదుకునేందుకు అని చర్యలు తీసుకుందని వివరించారు. నకిలీ విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు విక్రయిస్తే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని రైతులను ఆదుకోవాలని కోరారు. రైతులకు నష్టం జరిగితే సహించేది లేదన్నారు. రైతులకు ఏ సమస్య ఉన్న మనకు నేరుగా చెప్పవచ్చన్నారు. మన కూటమి పాలకుల కృషితోపాటు వరుణ దేవుడు కరుణ కూడా మనకు ఉందన్నారు డ్యాములు నిన్నే అన్నారు పుష్కలంగా ఈ ఏడాది మీరు కూడా అందుతుందని మన కూటమిలో అందరికీ మంచి జరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమం లో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, దర్శి మార్కెట్ యాడ్ చైర్మన్ దారం నాగవేణి – సుబ్బారావు, మండల టిడిపి అధ్యక్షులు మేడగం వెంకటేశ్వర రెడ్డి, వ్యవసాయ అధికారి ప్రసాదరావు, గ్రామ నాయకులు ఉన్నారు.

