పొగాకు కొనుగోలు ప్రక్రియను పటిష్టంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలి – జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ

జిల్లాలోని పొగాకు కొనుగోలు కేంద్రాల వద్ద నల్లబర్లీ పొగాకు రైతులు ఇబ్బందులు పడకుండా కొనుగోలు ప్రక్రియను పటిష్టంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, మార్క్ ఫెడ్ అధికారులను ఆదేశించారు.
గురువారం ఉదయం ఒంగోలు కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ చాంబర్ లో జాయింట్ కలెక్టర్ గోపాల కృష్ణ, జిల్లా స్థాయి పొగాకు కొనుగోలు కమిటీ సభ్యలతో సమావేశమై నల్లబర్లీ పొగాకు కొనుగోలు పై సమీక్షించి పలు అంశాలను ఆమోదించడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ… నల్లబర్లీ పొగాకు రైతులు ఇబ్బందులు పడకుండా కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. నల్ల బర్లీ పొగాకు పండించే చిన్న, సన్న కారు రైతులు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆగష్టు 10 వ తేదీ వరకు కు రీ షెడ్యూల్ చేయడం జరిగిందని, అందుకనుగుణంగా పొగాకు రైతుల నుండి మార్క్ ఫెడ్ ద్వారా నల్లబర్లీ పొగాకును కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. తొలి విడతలో ఒక రైతు వద్ద నుండి 2 మెట్రిక్ టన్నులు గాని లేదా 20 క్వింటాళ్ళు గాని కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేసిందన్నారు. కొనుగోలు ప్రక్రియ తక్కువ క్వింటాళ్ళు నుండి ఎక్కువ క్వింటాళ్ల కలిగిన రైతునుండి ఆరోహణ క్రమంలో 20 క్వింటాళ్ల కు మించకుండా కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. ప్రకాశం జిల్లాకు 800 మెట్రిక్ టన్నుల పొగాకు కొనుగోలుకు అనుమతివ్వగా, ఇప్పటివరకు జిల్లాలో 5.64 కోట్ల రూపాయల విలువ గల 677 మెట్రిక్ టన్నుల పొగాకును 245 మంది రైతుల వద్ద నుండి కొనుగోలు చేయడం జరిగిందన్నారు. నల్ల బర్లీ పొగాకు రైతులు నష్ట పోకుండా మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలుకు చర్యలు చేపట్టడం జరిగిందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎక్కడైనా కొత్త కొనుగోలు కేంద్రాల ఏర్పాటు అవసరమైతే, ప్రతిపాదనలను పంపినట్లైతే కొత్త కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 20 శాతంకు మించి తేమ శాతం ఉండరాదని, ఈ విషయమై రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ మరియు మండల వ్యవసాయ శాఖ అధికారుల పై ఉందన్నారు. రైతులు పొగాకు బేళ్ళను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన తరువాత తేమ శాతం 20 శాతం కంటే ఎక్కువ ఉందని తిప్పిపంపకుండా, కొనుగోలు కేంద్రాలకు తీసుకు రాకముందే పొగాకు తేమ శాతం 20 శాతం లోపు ఉండేలా రైతుల్లో అవగాహన కల్పించాల్సిన భాద్యత విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉందన్నారు. పొగాకు రైతులకు గ్రేడింగ్ మీద అవగాహన కల్పించాలని, జిల్లా వ్యవసాయ శాఖ అధికారికి సూచనలను జారీచేశారు. రైతుల వద్ద కొను పొగాకు నాణ్యతలో, ప్రమాణాల బాధ్యత, బయ్యర్లకు, ప్రాజెక్ట్ మేనేజర్లకు అప్పగించటం జరిగినదని తెలియజేశారు. గోడౌన్ యొక్క నిల్వకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు వచ్చునంత వరకు గోడౌన్ లలో నిల్వవుంచిన పొగాకు యొక్క నాణ్యత మరియు పరిమాణం యొక్క బాధ్యతను గోడౌన్ మేనేజర్ కు మరియు సొసైటీ ఇన్చార్జ్ కి అప్పగించటం జరిగినదని తెలియజేశారు. పొగాకు రైతులకు మేలు చేకూరేలా పొగాకు కొనుగోలు కు రాష్ట్ర ప్రభుత్వం అన్నీ చర్యలు తీసుకోవడం జరుగుచున్నదని తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సమావేశంలో మార్క్ ఫెడ్ డిఎం శ్రీ హరి క్రిష్ణ, జిల్లా సహకార శాఖాధికారి ఇందిరా దేవి, వ్యవసాయ శాఖ అధికారులు, మార్కెటింగ్, లీగల్ మెట్రాలాజి శాఖ అధికారులు, ఎస్ డబ్ల్యూసి సిడబ్ల్యూసి మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *