ఉపాధి పనులను ఇచ్చిన లక్ష్యాల మేరకు పూర్తి చెయ్యాలని ఎంపీడీఓ దార హనుమంత
రావు కోరారు. ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం ఎంపీడీఓ అధ్యక్షతన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ఇంకుడు గుంతలు ఫిష్ పాండ్స్ త్వరగా పూర్తి చెయ్యాలని వర్షాలు కురుస్తున్న సమయంలో పనులు సాధ్యం కాదని ప్రణాళికా ప్రకారం పూర్తి చెయ్యాలని ఇచ్చిన పనిదినాల ప్రకారం ఉపాధి కూలీలు ఎక్కువగా పనులలో పాల్గొనేలా చూడాలని కోరారు. పంచాయితీల వారిగా సమీక్ష నిర్వహించారు. ఎంపీఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శులు ఆయా గ్రామాలలో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రధ్ధ తీసుకోవాలని కోరారు. ట్యాంకులను బ్లీచింగ్తో శుభ్రం చేయించాలని చెప్పారు. ఎక్కడైనా నరే నీటి పైపులు లీకులు ఉంటే తక్షణమే బాగు చేయించాలని కోరారు. ఎఈ వాలి తదితరులు పాల్గొన్నారు.
