ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ఈ ఎపీ సెట్ కన్వినర్ సీట్ల కేటాయింపులో ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఫెస్ కళాశాల కన్వీనర్ కోట భర్తీలో జిల్లాలో ప్రధమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ …2025 వ సంవత్సరంలో ఈ ఎపీ సెట్ లో ఫెస్ కళాశాల ని అప్షన్ గా ఎన్నుకున్న ప్రతి విద్యార్థికి వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. మా కళాశాల మీద తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్నినిలబెట్టుకుంటున్నామని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నైపుణ్య శిక్షణా తరగతులు మొదటి సంవత్సరం నుండి ప్రారంభించి అత్యధిక ప్యాకేజిలతో ఉద్యోగాలు కల్పిస్తామని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ వివరించారు.
జిల్లాలో పలు కళాశాలలో భర్తీ అయిన సీట్ల వివరాలు ఇలా ఉన్నాయి……….
ఫెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో 86.06శాతం భర్తీ అయ్యాయి. అందులో మొత్తం సీట్లు 1080 సీట్లు ఉండగా 938 సీట్లు భర్తీ అయ్యాయి. 152 సీట్లు ఉన్నాయి. రైస్ కళాశాలలో 79.13 శాతం భర్తీ అయ్యాయి. అందులో 714 సీట్లు ఉండగా 565 భర్తీ అయ్యాయి. 149సీట్లు ఉన్నాయి. క్విజ్ కళాశాలలో 69.81 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. అందులో 1954 సీట్లు ఉండగా 1364 సీట్లు భర్తీ అయ్యాయి. 590 సీట్లు ఉన్నాయి. శ్రీ హర్షిణి లో 28.82 శాతం భర్తీ అయ్యాయి. అందులో 288 సీట్లు ఉండగా 83 భర్తీ అయ్యాయి. 205 సీట్లు ఉన్నాయి. మార్కాపురం, కనిగిరి, చీమకుర్తి, చీరాలలో కూడ 25శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. చీరాలలో ఒక్క సెయింట్ ఆన్స్ కళాశాలలో మాత్రం 89.49శాతం సీట్లు భర్తీ అయ్యాయి.
