జిల్లాలో 2025-26 సంవత్సరానికి స్వర్ణఆంద్ర @ 2047 లో భాగంగా మత్స్య సంపదను పెంచేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా
మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అధ్యక్షతన మత్స్య శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా నీటి యాజ్యమాన్య సంస్థ, బిసి కార్పోరేషన్ అధికారులతో కన్వర్జెన్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. 2025-26 సంవత్సరానికి లక్ష్యాలను సాధించడానికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద గుర్తించబడిన అన్ని ప్రజా నీటి వనరులలో క్యాప్టివ్ సీడ్ నర్సరీలను ఏర్పాటు చేయడానికి మత్స్య శాఖ మరియు జిల్లా నీటి యాజ్యమాన్య సంస్థ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మత్స్య కారుల జీవన ప్రమాణాలు మెరుగుపరచేందుకు నిర్దేశించిన పధకాల లక్ష్య సాధనకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ బిసి కార్పోరేషన్ అధికారులు తమ వంతు తోడ్పాటు అందించాలని జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో మత్స్యశాఖ జెడి శ్రీనివాస రావు, డిఆర్డిఎ, డ్వామా పిడి లు నారాయణ, జోసెఫ్ కుమార్, బిసి కార్పోరేషన్ ఈడి వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

