ఎపీసీపీ అధ్యక్షురాలు వైఎన్ షర్మిలా ను ఆపార్టీ రాష్ట్ర అసంఘటిత కార్మికుల మరియు ఉద్యోగుల సంఘ చైర్మన్, పార్టీ దర్శి నియోజక వర్గ ఇన్చార్జి కైపు వెంకట క్రిష్ణా రెడ్డి శుక్రవారం విజయవాడలో మర్యాద పూర్వకంగా కలిసారు. రాష్ట్రంలో పంచాయితీ నిధులు రాక పోవటంతో పారిశుధ్య కార్మికులు ఎదుర్కోంటున్న జీతాల కష్టాలు, చీమకుర్తిలో గ్రానైట్ కార్మికులు ఎదుర్కోంటున్న కష్టాల గురించి, తిరుపతి శ్రీ సిటిలో కార్మికులు జరపబోవు కార్యక్రమాల గురించి చర్చించారు. దర్శి నియోజక వర్గంలో రైతుల సమస్యలు, పార్టీ పటిష్టతకు తీసుకుంటున్న చర్యల గురించి చెప్పారు. ఆయా సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడికి లేఖ ద్వారా తెలియజేసి పరిష్కారానికి కృషి చేస్తానని వైఎన్ షర్మిల హామీ ఇచ్చినట్లు కైపు తెలిపారు.
