కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ పై జిల్లాస్థాయి అధికారులు నిరంతరం సమగ్రంగా పర్యవేక్షణ ఉంచాలి – కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా

ప్రభుత్వం నిర్దేశించిన కె.పి.ఐ ( కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్) పై జిల్లాస్థాయి అధికారులు నిరంతరం సమగ్రంగా పర్యవేక్షణ ఉంచాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా
చెప్పారు. ఆయా అంశాలలో పురోగతిని తాను కూడా ప్రతివారం సమీక్షిస్తానని చెప్పారు. కె.పి.ఐ. లక్ష్యాలు – పురోగతిపై అవగాహన కల్పించేందుకు శుక్రవారం ప్రకాశం భవనంలో అన్ని శాఖల ఉన్నతాధికారులతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో భాగంగా మన రాష్ట్రం కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెందేందుకు స్వర్ణాంధ్ర – 2047 పేరుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఈ సందర్భంగా కలెక్టర్ చెప్పారు. ఇందుకు ప్రధానంగా దృష్టి సారించాల్సిన అంశాలను గుర్తించి వీటిలో పురోగతి కోసం కె.పి.ఐ లను ప్రభుత్వం ఎంచుకున్నట్లు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే వీటి కోసం లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించిందని కలెక్టర్ తెలిపారు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి రాష్ట్రస్థాయిలో అన్ని శాఖల ఉన్నతాధికారులకు వీటిని తెలియజేస్తారని, అనంతరం అక్కడ నుంచి జిల్లాలలోని ఉన్నతాధికారులకు శాఖల వారీగా ఇవి వస్తాయని, వీటిని మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆయా లక్ష్యాలను కాలానుగుణంగా ( పీరియాడికల్ ) చేరుకునేలా చర్యలు తీసుకోవాలని, సంబంధిత వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసేలా చూడాలని చెప్పారు. మండల స్థాయి అధికారులు చేస్తున్న పనులు, సాధిస్తున్న పురోగతిపై జిల్లాస్థాయి ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆన్లైన్ లో రియల్ టైములో ఈ వివరాలు కనిపిస్తూ ఉంటాయి అన్నారు. వీటి ఆధారంగానే ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహిస్తారని కలెక్టర్ చెప్పారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన కె.పి.ఐ.ల పై అవగాహన పెంచుకొని, వాటి పురోగతిపై జిల్లాస్థాయి అధికారులు అందరూ ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆమె ఆదేశించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఫైళ్ళు సైతం…

         పరిపాలనలో సాంకేతిక వినియోగానికి పెద్ద పీట వేస్తున్న ప్రభుత్వం, ఇందులో భాగంగా శాఖల వారీగా ఆయా కార్యాలయాలకు సంబంధించిన జీవోలు, సర్క్యులర్లు, ఇతర కీలక ఫైళ్లను కూడా ఆన్లైన్లో పొందుపరిచేలా చర్యలు చేపట్టిందని కలెక్టర్ చెప్పారు. వీటిని epts.ap.gov.in వెబ్ సైటులో అప్లోడ్ చేయాలని అన్నారు. 

           ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ, డీఆర్ఓ బి.చిన ఓబులేసు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *