కొండపి నియోజకవర్గంలోని పలు నూతన రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు. శుక్రవారం విడుదల చేసిన ఓ పత్రిక ప్రకటనలో మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ… పాలేరు వాగుపై ముప్పాళ్ల, పైడిపాడు రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికి రూ.28 కోట్లు, టంగుటూరు – పాకల రోడ్డుకు రూ.6 కోట్లు మొత్తం రూ.34 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినట్టు మంత్రి స్వామి తెలిపారు. నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి మంత్రి స్వామి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న 4 ఏళ్లలో కొండపి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని మంత్రి స్వామి పేర్కొన్నారు. అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగాలంటే రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉండాలని మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు.
