తాళ్లూరు మండల తహసీల్దార్ గా బచ్చల వెంకట రమణా రావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన పామూరు తహసీల్దార్ గా పనిచేస్తూ సెలవులో ఉన్నారు. సెలవు అనంతరం తాళ్లూరు తహసీల్దార్ బదిలీపై వచ్చారు. ఇప్పటి వరకు ఇన్చార్జి తహసీల్దార్ గా ముండ్లమూరు తహసీల్దార్ లక్ష్మినారాయణ ఉన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్‌ను రెవిన్యూ అధికారులు, సిబ్బంది పుష్పగుజ్జం ఇచ్చి స్వాగతం పలికారు. మిఠాయిలు తినిపించారు. రైతులను నిత్యం అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని తహసీల్దార్ బచ్చల వెంకట రమణారావు తెలిపారు. ఎ అవసరమైన రైతులు నేరుగా తనను సంప్రదించవచ్చని చెప్పారు.

