హెపటైటిస్ ఇక వేచి చూడదు.వరల్డ్ హెపటైటిస్ పై అవగాహన అవసరం – డా. కావ్య దెందుకూరి.

హైదరాబాద్ జులై 26(జే ఎస్ డి ఎం న్యూస్) :
హెపటైటిస్ ఇక వేచి చూడదని,హెపటైటిస్ పై అవగాహన ఎంతో అవసరం అని డా.కావ్యా దెందుకూరి అన్నారు.వరల్డ్ హెపటైటిస్ డే (జూలై 28) సందర్భంగా, గ్లోబల్ స్థాయిలో జరుపుకునే ఈ ప్రత్యేక డే లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ప్రభావితం చేస్తూ చాపకింద నీరులా ప్రమాదకరమైన లివర్ వ్యాధులైన వైరల్ హెపటైటిస్ ను గమనించి, నిర్ధారించే మరియు సమయానికి చికిత్స తీసుకోవాలన్న అత్యవసరతను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని గ్లెనిగల్స్ హాస్పిటల్, లక్డీకాపూల్, హైదరాబాద్‌లో లీడ్ ట్రాన్స్‌ప్లాంట్ హెపటాలజిస్ట్ మరియు లివర్ స్పెషలిస్ట్ అయిన డా. కావ్య తెలిపారు.
ఈ సందర్భంగా డా.కావ్య మాట్లాడుతూ హెపటైటిస్ చివరివరకు గుర్తించలేరన్నారు. ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్ల మందికి పైగా వైరల్ హెపటైటిస్‌తోబాధపడుతున్నారు. చాలా మంది దీని గురించి తెలియకపోవడం వల్ల ఇది సిరోసిస్‌, లివర్ ఫెయిల్యూర్ లేదా లివర్ కాన్సర్‌కు దారి తీస్తుంది. భారతదేశంలో హెపటైటిస్ బి మరియు సి లు క్రానిక్ లివర్ డిసీజుల ప్రధాన కారణాలు అని డా. కావ్య అన్నారు.ఈ సంవత్సరం గ్లోబల్ థీమ్ (హెపటైటిస్ ఇక వేచి చూడదు) అని పేర్కొంటూ, వెంటనే చర్య తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. స్క్రీనింగ్, వ్యాక్సినేషన్ లేదా ట్రీట్‌మెంట్‌లో ఏ చిన్న ఆలస్యం అయినా లివర్‌ను గణనీయంగా దెబ్బతీసే ప్రమాదం లేదా ప్రాణాపాయ పరిస్థితికి దారి తీస్తుంది.
నిర్ధిష్ట కారణం లేని అలసట, ఆకలి కోల్పోవడం లేదా లివర్ ఫంక్షన్ టెస్టులలో అసాధారణ ఫలితాలు ఉన్నవారు, డయాబెటిస్, ఐ వి డ్రగ్ వినియోగం ఉన్నవారు, అసురక్షిత లైంగిక సంబంధాలు కలిగినవారు, 2001కి ముందు రక్త బదిలీ పొందినవారు, హెపటైటిస్ బీ/సీ ఉన్నవారితో కాంటాక్ట్‌లో ఉన్నవారు – వీరంతా స్క్రీనింగ్ చేయించుకోవాలి.
సాధారణ రక్త పరీక్షతో వైరస్‌ను గుర్తించవచ్చు. హెపటైటిస్ బి వ్యాక్సిన్‌తో నివారించగలిగే వ్యాధి. హెపటైటిస్ సి కి ప్రస్తుతం చిన్న పిల్స్‌తో పూర్తి చికిత్స అందుబాటులో ఉంది. మన లివర్ కేవలం ఆల్కహాల్ డిటాక్స్ చేయడానికే కాదు – ఇది హార్మోన్లు, ఇమ్యూనిటీ, మెటబాలిజం మరియు భావోద్వేగాలను కూడా నియంత్రిస్తుంది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా సంరక్షించాలి అని డా. కావ్య తెలిపారు.
జూలై 28, న గ్లీనీగిల్స్ హాస్పిటల్‌లో ఉచిత లివర్ ఆరోగ్య శిబిరంవరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించనుంది.
ఈ శిబిరంలో ఉచితంగా అందించబడే సేవలు: ఉచిత డాక్టర్ కన్సల్టేషన్, ఫైబ్రో స్కాన్ జి ఆర్ బి ఎస్ (లివర్ ఆరోగ్య పరీక్ష), బీపీ చెక్,
(షుగర్ టెస్ట్), హెపటైటిస్ బి & సి స్క్రీనింగ్ పరీక్షలు ఉంటాయని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *