తాళ్లూరు మండల వైసీపీ కార్యాలయంలో సోమవారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఆపార్టీ మండల అధ్యక్షుడు టీవీ సుబ్బా రెడ్డి తెలిపారు. కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొంటారని చెప్పారు. ఈ సమావేశంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ పై చర్చించి ఇంటింటి లోను చంద్రబాబు మోసాన్ని తెలియచేయనున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యాలని కోరారు.
