ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పమని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఆదివారం నెల్లూరు జిల్లా కందుకూరులో రాజేష్ చిల్డ్రన్ హాస్పిటల్ ను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి మంత్రి డా.స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ….. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా పేదలకు ఉచిత వైద్య సౌకర్యాలు అందిస్తున్నారన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలోకి రాని వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయనిధితో ఆదుకుంటున్నారన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలనేదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. గత ఐదేళ్లలో వైసిపి వైద్య శాఖను వెంటిలేటర్ పై ఉంచి పేదల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి ప్రజలు ఆస్తుల్ని దోపిడీ చేశారని ఆరోపించారు. వైసీపీ హయాంలో వైద్య శాఖ వెంటిలేటర్ పై ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్య శాఖలో శాఖలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి పేదల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తున్నామని మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు.


