ఉత్సాహభరితంగా రన్ ఫర్ ఆర్గన్ డొనేషన్.అవయవదానం పట్ల మోహన్ ఫౌండేషన్ అవగాహన.

హైదరాబాద్, ఆగస్ట్ 3 (జే ఎస్ డి ఎం న్యూస్) :
నెక్లెస్ రోడ్డులోని సంజీవయ్య పార్క్ వద్ద ఆదివారం ఉదయం తెలంగాణ 10కే రన్ – రన్ ఫర్ ఆర్గన్ డొనేషన్ 3వ ఎడిషన్‌ ఉత్సాహభరితంగా జరిగింది. మోహన్ ఫౌండేషన్ ఆద్వర్యంలో గ్లోబల్ ఈవెంట్స్ అండ్ ఎంటర్ టైన్ మెంట్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, నిప్పాన్ ఎక్స్‌ప్రెస్ సంయుక్తంగా 5కే, 10కే విభాగాల్లో జరిగిన ఈ రన్ లో 2,000 మందికి పైగా రన్నర్స్, సాధారణ పౌరులు పాలుపంచుకున్నారు. ప్రపంచ అవయవదానం దినోత్సవాన్ని పురస్కరించుకుని, అవయవదానం గురించి ప్రజల్లో అవగాహన కలిగించేందుకు గాను
రన్ నిర్వహించింది. ఈ రన్ ను బ్యాంక్ ఆఫ్ ఇండియా సౌత్ జనరల్ మేనేజర్ మనోజ్ కుమార్ శ్రీవాస్తవ, మోహన్ ఫౌండేషన్ సీఈఓ రఘురాం లు జెండా ఊపి ప్రారంభించగా, అతిధిగా హాజరైన పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ విజేతలకు మెడల్స్ ను అందజేశారు. మనిషి జీవితం తర్వాత మరో జీవితం ఇవ్వగల అవయవ దానం పట్ల అందరిలో అవగాహన పెరగాలని, ఇందుకు మోహన్ ఫౌండేషన్ చేస్తున్న కృషి ఈటల అభినందించారు. అవయవ దానం ద్వారా మారిన జీవితాల కథలు ఎంతో స్పూర్తిదాయకమని, మోహన్ ఫౌండేషన్ ఇదే దిశగా నిరంతరం కృషి చేస్తోందని మోహన్ ఫౌండేషన్ సీఈఓ రఘురాం అన్నారు. అలాగే, మ్యాక్స్ ప్రోటీన్, డా. రెడ్డీస్, మేఘావి వెల్నెస్ స్పా, బాడీ ఆర్మర్లైట్, బెనెఫిక్, జో ఆర్మీ, వాక్‌ఫిట్, హైఫైవ్ ట్రైబ్, జర్మెటీన్ హాస్పిటల్స్, వి ఎస్ ఎం ఎంటర్‌టైన్‌మెంట్స్, డెకాథ్లాన్ సికింద్రాబాద్, తాజ్ హోటల్స్, స్నాప్‌వెల్ట్, మూవ్‌మెంటిజం, కార్నిటోస్, అక్షయ కల్ప, అంపుల్ రీచ్, ఫ్లాషిఫై, ఆల్కలైన్, వర్క్ ఇండియా, గ్రీన్ మాటర్ తదితర సంస్థలు భాగస్వాములుగా మద్దతు ఇచ్చాయి.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *