తూర్పుగంగవరంలో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు వైసీపి జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. మాజీ పార్టీ ప్రధాన కార్యదర్శి యాడిక యలమందా రెడ్డి ఇటీవల బైక్ ప్రమాదానికి గురై చెయ్యికట్టుకట్టించుకుని నివాసం వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రమాదం జరిగిన తీరును వివరాలను డాక్టర్ బూచేపల్లి అడిగి తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా భీమిని సుబ్బా రావు, గోల్డ్ వెంకటేశ్వర రెడ్డి అమ్మ అంకమ్మ, నగళ్ల పాపయ్య ను పరామర్శించారు. అనంతరం తాళ్లూరు మాజీ ఎంపీపీ కోట రామి రెడ్డి, వైసీపి నాయకుడు కోట క్రిష్ణా రెడ్డి తల్లి హనుమమ్మ సంస్మరణ దినోత్సవంను హాజరై నివాళులు అర్పించారు. ఆయా కార్యక్రమాలలో పార్టీ అధ్యక్షుడు టీవీ సుబ్బా రెడ్డి, పార్టీ సంయుక్త కార్యదర్శి పోశం మధుసూధన రెడ్డి, మాజీ ఎంపీపీ గోళ్లపాటి మోషే, మాజీ ఎఎంసీ డైరెక్టర్ గుజ్జులయోగి రెడ్డి, మాజీ దేవస్థాన కమిటీ చైర్మన్ కటకంశెట్టి శ్రీనివాస రావు, దేవదానం, లాయర్ మల్లీశ్వర రెడ్డి, యత్తపు మధుసూధన రెడ్డి, కొండా రెడ్డి, గోపు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
