సీఎం పర్యటన విజయవంతం పట్ల రైతులకు కృతజ్ఞతలు తెలిపిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి

దర్శిలో సీఎం చంద్రబాబు సభసక్సెస్ చేసిన ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం ఆమె విలేకర్ల సమావేశంలో మాట్లా డుతూ…. ముఖ్యమంత్రి అన్నదాత సుఖీ భవ నిధులు విడుదల చేసి రైతుల ముఖంలో ఆనందం చూస్తుంటే దరిశి ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ఓర్వలేక తాడేపల్లి స్క్రిప్టును చదివి హేళన చేయడం ఆయన విజ్ఞతకువదిలేస్తున్నామన్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా 75 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి కార్యక్రమాలు నిర్వహించడం మీకు హేళనగా ఉందా అని ప్రశ్నించారు. గొట్టిపాటి కుటుంబం ప్రజలకు సేవ చేసే కుటుంబం అని నాడు తాతల వద్ద నుండి నేడు బాబాయి వరకు ప్రజల సేవకే అంకితం అయ్యామని వివరించారు. తక్కువ సమయం లో అత్యధిక మెజార్టీ ఓట్లు సాధించామని వివరించారు.
కార్యక్రమంలో నియోజకవర్గంలోని దొన కొండ, దర్శి, ముండ్లమూరు, తాళ్లూరు మండలాల టిడిపి అధ్యక్షులు మోడీ ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, కూరపాటి శ్రీను, మేడగం వెంకటేశ్వరరెడ్డి, దర్శి, దొనకొండ టౌన్ పార్టీ అధ్యక్షులు చిన్నా, తోహిద్, రాష్ట్ర మహిళా నాయకురాలు శోభారాణి, మాజీ మండల పార్టీ అధ్యక్షులు కాట్రాజు నాగరాజు, బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి, సోమేపల్లి శ్రీను, సానే సుబ్బయ్య, నీటిసంఘం డిసి అధ్యక్షులు వెలుగొండారెడ్డి, మంచుమాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *