ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ 79 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సరికొత్త ఫ్రీడమ్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ తో కేవలం రూపాయి రీఛార్జితో 30 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత కాలింగ్, రోజుకు రెండు జిబి డేటా అలాగే రోజుకు 100 మెసేజ్లు, ఉచిత సిమ్ కార్డు ఇవ్వనున్నట్లు బిఎస్ఎన్ఎల్ గుంటూరు బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ సప్పరపు శ్రీధర్ తెలిపారు. ఈ ప్లాను కేవలం నూతన వినియోగదారులకు, వేరే నెట్వర్క్ నుండి బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ల కి కొత్తగా వచ్చే వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ప్లాన్ కేవలం ఆగష్టు 1వ తేదీ నుండి 31 వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ యాక్టివేట్ చేయించుకోవడానికి వినియోగదారులు తమ దగ్గరలోని బిఎస్ఎన్ఎల్ వినియోగదారుల సేవ కేంద్రాన్ని సంప్రదించగలరు. కనుక అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఫ్రీడమ్ ప్లాన్
04
Aug