దర్శిలో చిరికాలంగా టెక్నికల్ఎస్సైగా పనిచేసి పదవి విరమణ చెందిన మార్తల వెంకటేశ్వర రెడ్డి కుమారుడు ఖగోళ రెడ్డి (31) బెంగులూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. యువకుడు ఖగోళ రెడ్డి నూజి లాండ్ లో ఎంబీఏ పూర్తి చేసి, మంచి బిజినేస్ పెట్టాలన్న ఆలోచనతో పరిశీలన చేస్తున్నాడు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా తన స్నేహితులతో కలసి బెంగుళూరులో గడిపేందుకు హైదరా బాద్ నుండి బెంగుళూరు వెళ్లారు. బెంగుళూరులో ఆదివారం తెల్లవారు జామున ఫేమస్ బిర్యాని పాయిట్ ఉర్కోట్ వద్దకు వెళ్లి అతి ఇంకా తెరవక పోయ్యే సరికి తిరిగి అదే బైక్ పై వస్తుండగా హేల్మేట్ క్రింద పడిపోయినది. అది తీసుకునే క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టగా ప్లే ఓవర్ క్రింద ఉన్న సర్వీస్ రోడ్ లో ఖగోళ రెడ్డి పడిపోయి మృతి చెందాడు. మృత దేహానికి పోస్టు మార్టమ్ నిర్వహించి దర్శికి అత్యక్రియలకు తరలించారు. రిటైర్డు వెంకటేశ్వర రెడ్డికి ఇరువురు కుమార్తెలు, ఎకైక కుమారుడు కాగా ఆయన మృతితో ఆ కుటుంబం, బంధు మిత్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వారిని ఓదార్చటం ఎవరి తరం కావటం లేదు.
