బాధితులకు తక్షణ న్యాయం అందేలా కృషి చేయాలి – ఎస్పీ దామోదర్ – పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్(మీకోసం) కార్యక్రమంకు 67 ఫిర్యాదులు

ప్రజా ఫిర్యాదులను పరిష్కరించేందుకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ దామోదర్ మరియు పోలీస్ అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాధిదారులు తమ సమస్యలను జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ కు, పోలీస్ అధికారులకు విన్నవించుకున్నారు. ఫిర్యాదుదారులతో ముఖాముఖీగా మాట్లాడి వారి ఫిర్యాదుల పూర్వాపరాలను అడిగి తెలుసుకుని, వాటిని చట్టపరంగా త్వరితగతిన పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ భరోసా కల్పించారు. అందిన ఫిర్యాదులపై పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి, తక్షణమే విచారణ జరిపి బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కుటుంబ కలహాలు, భర్త/అత్తారింటి వేధింపులు, చీటింగ్/జాబ్ ఫ్రాడ్, భూ వివాదాలు మరియు ఇతర సమస్యల గురించి ప్రజా పిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని ఇలా ఉన్నాయి…..
తన అవసరాల నిమిత్తం ఏటీఎంలో డబ్బులు జమ చేయడానికి వెళ్లగా మిషన్ పనిచేయలేదు. ఆ సమయంలో ఒక వ్యక్తి నెఫ్ట్ ద్వారా డబ్బులు పంపిస్తానంటూ డబ్బులు పంపినట్లుగా ఫేక్ మెసేజ్ చూపించి, అతనిని నమ్మించి, రూ.50,000/- తీసుకున్నాడు. అయితే డబ్బులు అకౌంటులో పడకపోవడంతో మోసం చేసాడని ఒంగోలు, వెంకటేశ్వర కాలనీకి చెందిన ఒక వ్యక్తి ఫిర్యాదు. తనకు ఒక సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి, నకిలీ ఉత్తర్వు పత్రాలు చూపించి, తన వద్ద నుంచి రూ.2 లక్షలు తీసుకుని ఉద్యోగం ఇప్పించకపోగా, తీసుకున్న డబ్బులు తిరిగి అడిగితే చల్లని చెక్కు ఇచ్చి మోసం చేశారని కందుకూరు టౌన్‌కు చెందిన ఓ మహిళ ఫిర్యాదు. ఈ కార్యక్రమంలో ఎస్సీ/ఎస్టీ సెల్ ఇన్స్పెక్టర్ దుర్గ ప్రసాద్, డిటిసి ఇన్స్పెక్టర్ షమీముల్లా, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పాండు రంగారావు, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్ రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *