పేద విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. సోమవారం ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ఐఐటీ, నీట్ ఎక్సలెన్సీ సెంటర్లో విద్యార్థులకు నారాయణ విద్యా సంస్థల సహకారంతో ఉచిత మెటీరియల్స్ మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ….ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు రాష్ట్రంలోని గురుకులాల్లో ఐఐటీ, నీట్ ఎక్సలెన్సీ సెంటర్లు మూడు నుంచి 10కి పెంచామన్నారు. ఐఐటి, నీట్ లో తృటిలో అర్హత కోల్పోయిన ఎస్సి, ఎస్టీ గురుకులాల వద్యార్థులకు ఉచిత లాంగ్ టర్మ్ కోచింగ్ ఇస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈ లాంగ్ టర్మ్ కోచింగ్ శిక్షణకు నారాయణ విద్యాసంస్థలు తమస్టాప్ ను ఉచితంగా ఇస్తుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ, మరియు ఐఐటీ, నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ కి స్టాఫ్ ని ఇచ్చినందుకు మంత్రి నారాయణకు మంత్రి స్వామి కృతజ్ఞతలు తెలిపారు.

