కనిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి సోమవారం కనిగిరి లోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌కు సంబంధించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకొని, ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ నిర్వహించడం జరిగినట్లు తెలిపారు. హాస్టల్ లో ఉన్న వసతి సౌకర్యాలు, భోజన మెనూ నిర్వహణ, శుభ్రత వంటి అంశాలపై సమీక్ష చేపట్టారు. హాస్టల్‌లో విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. తనిఖీ సందర్భంగా, హాస్టల్ వసతి, సౌకర్యాలు ఇంకా మెరుగుపర్చాలని, విద్యార్థులకు పోషకాహారంతో కూడిన భోజనాన్ని సమయానికి అందించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారి లక్ష్మా నాయక్ మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా హాస్టల్ వసతుల విషయంలో ఎలాంటి అలసత్వం ఉపేక్షించము. మెనూ నిర్వహణలో కూడా నాణ్యత తప్పనిసరి అని హెచ్చరించారు. అధికారులకు తగిన సూచనలు ఇచ్చి, పర్యవేక్షణ మరింత కఠినంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ తనిఖీ కార్యక్రమంలో ఎమ్మెల్యే తోపాటు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారి లక్ష్మా నాయక్ , సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ శివ నాయక్ , ఎస్ఐ శ్రీరామ్ పాల్గొన్నారు.
