బేగంపేట ఆగస్టు 5(జే ఎస్ డి ఎం న్యూస్) :
నగరంలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి బేగంపేట శ్యామలాల్ బిల్డింగ్ శ్రీ విజయ గణపతి ఆలయం జంక్షన్ నుంచి కొచ్చర్ అపార్ట్మెంట్ వద్ద ఉన్న నాలా మరుగుదొడ్ల వరకు భారీ ఎత్తున వరద నీరు నిలిచి పోయింది.దీంతో వాహనదారులు, బస్తివాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు నాలా నీటి ప్రవాహానికి చెత్తాచెదారం పెద్ద ఎత్తున అడ్డుపడిందని దీంతో నాలోకి వెళ్లే నీరు పూర్తిస్థాయిలో పోకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని, గుర్తించిన కాంగ్రెస్ నాయకుడు హౌసీ టోచర్ ఈ సమస్యను అధికారులు దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన అధికారులు వెంటనే జెసిబి ని ఆ ప్రాంతానికి పంపించారు. నాలా లో నీటి ప్రవాహానికి ఆటంకంగా మారిన వ్యర్థాలను జెసిబి సహాయంతో తొలగించారు. దీంతో ఆ మార్గంలో వెళ్లే నీరు సాఫీగా వెళ్ళింది. ఏళ్ల తరబడిగా
ఇక్కడ పేరుకుపోయిన వ్యర్ధాలను తొలగించడంతో నీరు సాఫీగా ముందుకు సాగింది. దీంతో పాటు మరికొన్ని వ్యర్ధాలను నాలాలో నుంచి తొలగించాల్సి ఉంది. వాటిని కూడా తొలగిస్తే భారీ వర్షం కురిసినా,ఈ ప్రాంతం నుంచి నాలలోకి చేరే నీరు సాఫీగా సాగే అవకాశం ఏర్పడుతుంది .శ్యామ్ లాల్ బిల్డింగులో పెద్ద ఎత్తున నిలిచిపోయిన వరద నీటిని సాఫీగా నాలా లోకి వెళ్ళేలా చేసి సకాలంలో స్పందించిన జిహెచ్ఎంసి డిప్యూటీ ఈ ఈ మహేష్ కుమార్, జిహెచ్ఎంసి సివిల్ వర్క్స్ ఏ ఈ హెన్రీ, ఇన్స్పెక్టర్ గోపాల్, హైడ్రా ఆధికారి సుభాషనరెడ్డి, మురుగన్, శ్రీరాములు కు కాంగ్రెస్ నాయకులు స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు హోసీ టోచర్, పిఎన్ నటరాజ్, నరసింహ యాదవ్, టి ఎం యాదగిరి, రాజేష్, పేపర్ శేఖర్, ఏకే జహంగీర్ తదితరులు ఉన్నారు.

