సీఎం ప్రవాసి ప్రజావాణి కో – ఆర్డినేటర్ గా బొజ్జ అమరేందర్ రెడ్డి నియామకం

హైదరాబాద్ ఆగస్ట్ 6(జే ఎస్ డి ఎం న్యూస్) :

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సీఎం ప్రవాసి ప్రజావాణి కో – ఆర్డినేటర్ గా అమెరికా ఎన్.ఆర్.ఐ. బొజ్జా అమరేందర్ రెడ్డి నియామకమయ్యారు.ఈ మేరకు సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ఎన్.ఆర్.ఐ. సలహా మండలి చైర్మన్ డాక్టర్ బీ.ఎం. వినోద్ కుమార్ నూతన కో- ఆర్డినేటర్ అమరేందర్ రెడ్డిని అభినందించారు. ఈ మేరకు నియామక పత్రాన్ని అందజేశారు.ప్రవాసి ప్రజావాణి కో- ఆర్డినేటర్ తోపాటు నార్త్ అమెరికా ఎన్.ఆర్.ఐ. ల సమస్యలపై దృష్టిని సారించాలని అమరేందర్ రెడ్డికి సూచించారు.

నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం ఉప్పరిపల్లి గ్రామానికి చెందిన వాసి అమరేందర్ రెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *